ETV Bharat / state

చంద్రబాబు సెక్యూరిటీ డ్యూటీలోకి అటానమస్ డ్రోన్- సీఎం భద్రత భారీగా కుదింపు - CM CHANDRABABU SECURITY CHANGES

భారీ భద్రత, బందోబస్తు హడావుడికి దూరంగా సీఎం చంద్రబాబు - సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్‌తో పరిసర ప్రాంతాల్లో భద్రత పర్యవేక్షణ

CM_Chandrababu_Security
CM Chandrababu Naidu Security Changes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2024, 2:26 PM IST

CM Chandrababu Security Changes: ముఖ్యమంత్రి అంటేనే చుట్టూ వందలాది మందితో భారీ భద్రత. బయటకొస్తే చాలు అడుగడుగునా ఆంక్షలు, బారికేడ్లు, చెక్ పోస్టులు అబ్బో ఆ హడావుడే వేరులే. కానీ ప్రజల ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చంద్రబాబు వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. ఎక్కువ మంది పోలీసులు, సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని టెక్నాలజీ సాయంతో తక్కువ మందితోనే మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చని నిరూపిస్తున్నారు. సీఎం నివాసంలో భద్రత పర్యవేక్షణను చేస్తున్న 'అటానమస్ డ్రోన్ల' ప్రత్యేకతలు ఏంటో చూసేద్దాం రండి.

నాడు 980 మందితో భారీ భద్రత: గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో హంగూ ఆర్భాటాలతో నానా హడావుడి చేశారు. మితిమిరిన భద్రతతో ప్రజలను అనేక విధాల ఇబ్బంది పెట్టారు. తాడేపల్లి ఇంటి చుట్టూ చెక్ పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ఆర్మడ్ గాడ్స్, పబ్లిక్ రోడ్లలో జనాలు తిరగకుండా ఆంక్షలతో సీఎం నివాస చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తి నిషేధిత ప్రాంతంగా చేశారు. ప్రత్యేక ఆపరేషన్లకు ఉపయోగించే ఆక్టోపస్ టీం ఫోర్స్‌ను తన ఇంటి చుట్టుపక్కల 24 గంటలు సెక్యూరిటీలో ఉపయోగించారు. ఇంటికి నలుమూలలా నలుగురు స్నైపర్స్‌ను కూడా జగన్ భద్రత కోసం మోహరించారు. బుల్లెట్ ఫ్రూప్ వాహనాలతో మొబైల్ క్యూఆర్టీలు ఏర్పాటు చేసి దేశంలో ఏ ఇతర సీఎంకు లేని స్థాయిలో నాడు సెక్యూరిటీ కోసం కోట్లు ఖర్చు చేశారు. ఏడాదికి 90 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక బలగాలతో 980 మందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారు.

నేడు కేవలం 121 మంది మాత్రమే: కానీ 4వసారి సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం వీటన్నింటికీ తాను దూరమంటూ నిరూపించుకుంటున్నారు. తాను ప్రజలకు మాత్రం సేవకుడినంటూ చూపిస్తున్నారు. జగన్​కు ఉన్న భద్రతా సిబ్బందిలో 5 వంతుతోనే భద్రత కల్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రికి 980మందిగా ఉన్న భద్రత నేడు కేవలం 121మందికి చేరింది. సీఎంగా జగన్ కాన్వాయిలో 17 వాహనాలు ఉండగా, జడ్ ప్లస్ భద్రత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాహన శ్రేణి 11వాహనాలకే పరిమితమైంది. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా అవసరమైన కనీస సిబ్బందితో ఆయన భద్రత కొనసాగుతుంది.

పార్టీ జెండా మోసేది కార్యకర్తలే - వారిని నిత్యం గౌరవించాలి: నేతలతో చంద్రబాబు

అటానమస్ డ్రోన్‌తో భద్రత పర్యవేక్షణ: ఎక్కువ మంది పోలీసులు, సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని టెక్నాలజీ సాయంతో తక్కువ మందితో ప్రణాళికతో వ్యవహరించినా మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్‌ను ఏర్పాటు చేశారు. సీఎం నివాసంలో 'అటానమస్ డ్రోన్ల' సాయంతో పరిసరి ప్రాంతాల భద్రత పర్యవేక్షణను చేపట్టారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒక సారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది.

సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా మూమెంట్ కనిపించినా, కొత్త వస్తువులు, అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీంకు మెసేజ్ పంపుతుంది. సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటనామస్ విధానంలో ఆటోపైలెట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్లీ వచ్చి నిర్దేశించిన డక్​పై ల్యాండ్ అయ్యి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపే డాటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

బందోబస్తు హడావుడి తగ్గించాలి: అటానమస్ డ్రోన్ ద్వారా తక్కువ సమయం, సిబ్బందితో ఎక్కువ పని జరుగుతుంది. నాణ్యతా పెరుగుతుంది. ప్రైవేటు కార్యక్రమాలకు సీఎం వెళ్తున్న సందర్భంలో అక్కడి వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సిబ్బందిని పెట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావుడి తగ్గించాలని సీఎం గట్టిగా సూచించారు. ఇలా ప్రతి విషయంలో ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో చాలా వరకు సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షల సమస్య తలెత్తడం లేదు. వీటిని మరింత సరళీకృతం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీఎం ఆదేశాలతో అధికారులు భద్రతలో సమూల మార్పులు చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయ సేకరణ: సీఎం చంద్రబాబు

పనితీరు ఆధారంగానే పదవులు - ఏమీ చేయకుండా ఉంటే కుదరదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.