APL Season 2 Start: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-2 ప్రారంభం.. సందడి చేసిన నటీ శ్రీలీల - Andhra Premier League
🎬 Watch Now: Feature Video
APL Season 2 Start : విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్-2(Andhra Premier League in Visakha) పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు టీములు ఈ పోటీలలో తలపడనున్నాయి. భారత్ క్రికెట్ జట్టులో ఆడుతున్న భరత్, విహారి వంటి ప్లేయర్లు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లలో స్థానం సంపాదించి రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. సీజన్-1 మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇందులో పలువురు క్రీడాకారులు ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నారన్నారు. ఏపీఎల్- 2 - వైజాగ్ వేదికగా ఈ నెల 27వ తేదీ వరకు టోర్నీ-యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకే ఏపీఎల్-ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రా రెడ్డి వివరించారు. సినీ హీరోయిన్ లీల గౌరవ అతిథిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. వీడీసీఏ అధ్యక్షులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఏపీఎల్ ద్వారా యువ క్రీడాకారులను ప్రపంచానికి తెలియచేసేందుకు అవకాశం లభించిందన్నారు.