Volunteers Protest: వాలంటీర్లు Vs జనసైనికులు.. పోటాపోటీగా ఆందోళనలు - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Volunteers Protest: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్రపటానికి జనసైనికులు పాలాభిషేకం చేశారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాన్ని పవన్ ప్రశ్నిస్తే తప్పేంటని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు చేస్తున్న ఆందోళనలను నిరసిస్తూ పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాగా మంగళవారం ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని పునరుద్ఘాటించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజల భద్రతకు ముప్పుందన్న పవన్.. జగన్ నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ నడుం విరగ్గొడతానని హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.