AP SC Commission Chairman Victor Prasad :"అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటాం"

🎬 Watch Now: Feature Video

thumbnail

 AP SC Commission Chairman Victor Prasad : అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. బాపట్ల పట్టణం అంబేద్కర్ భవన్లో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. బాధితులు ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు నమోదు చేయకుంటే తన దృష్టికి తీసుకురావాలని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూస్తానన్నారు. దళితులకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజ్యాంగం ప్రకారం పని చేయాలన్నారు. తాను బాపట్ల కు వస్తుంటే డీఎస్పీ సెలవుల్లో వెళ్ళటం సరికాదన్నారు. అంటరానితం నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చార్వాక మాట్లాడుతూ.. జిల్లా ఉన్నతాధికారులు ఒక ఎస్సీ అధికారి కూడా లేరన్నారు. దాడులకు గురైన ఎస్సీలు న్యాయం కోసం పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తనను తొలగించాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్​కు చెప్పారని విక్టర్ అన్నారు. తన నిజాయితీని చూసి సీఎం తనను పదవిలో కొనసాగిస్తున్నారంటూ తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Oct 5, 2023, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.