రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి - కరవు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలి : వడ్డే శోభనాద్రీశ్వరరావు

🎬 Watch Now: Feature Video

thumbnail

AP Rythu Sangham Round Table Meeting on Drought: ఆంధ్రప్రదేశ్‌లో కరవు విలయతాండవం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికసాయం ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతిన్న అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి, తక్షణమే రైతులకు నష్టం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Sobhanadriswara Rao Comments: రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న కరవుపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..''రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి కారణంగా లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాగేందుకు మంచినీరు దొరకదు. వైఎస్ జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులు పంటలకు నీరు అందక నష్టపోతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కరవు మండలాలను ప్రకటించి, రైతులను ఆదుకోవాలి.'' అని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.