AP Professional Forum Fires On Sajjala: కమ్యూనిస్టులకు సజ్జల క్షమాపణలు చెప్పాలి: ఏపీ ప్రొఫెషనల్ ఫోరమ్ - chandrababu naidu illegal arrest
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 8:17 PM IST
AP Professional Forum Fires On Sajjala: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ వ్యవస్థాపకుడు నేతి మహేశ్వరరావు ఆక్షేపించారు. చంద్రబాబు ఏమైనా దేశం వదిలి పారిపోతారా.. అంత పెద్ద నేతను అరెస్టు చేసి విధానం ఇదేనా.. అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధ పాలన సాగడం లేదు.. వ్యవస్థలేమీ పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు విషయంపై మాట్లాడే ప్రతి ఒక్కరినీ దొంగలుగా చూడటం సరికాదని హితవు పలికారు. అదే విధంగా కమ్యూనిస్టులు అమ్ముడుపోయారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సైతం ధ్వజమెత్తారు. మీరేమైనా సీఎం, హోం శాఖ మంత్రినా.? ఏ హోదాతో మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. సజ్జల సకల శాఖ మంత్రి అని.. షాడా సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటూ రాజకీయాలు గురించి మాట్లాడం ఏంటని ప్రశ్నించారు. అసలు కమ్మూనిస్టులను మీరు కొనగలరా.? అంటూ దుయ్యబట్టారు. మీ వద్ద డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ఎవరినైనా కొనవచ్చు. అమ్మవచ్చు అని అనుకుంటున్నారా..? జీవితాలను త్యాగం చేసి పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులపై చేసిన మీరు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మహేశ్వరరావు డిమాండ్ చేశారు.