Rudraraju Met Rahul Gandhi: 'విశాఖ ఉక్కు, ఇతర సమస్యలపై రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చాం' - రాహుల్ గాంధీని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు
🎬 Watch Now: Feature Video
Gidugu Rudraraju Met Rahul Gandhi: విశాఖ ఉక్కు సహా రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలపై రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఖమ్మంలో జనగర్జన సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో ఖమ్మం బయలుదేరి వెళ్లారు. తెలంగాణా వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షడు రుద్రరాజు, మాజీ ఎంపీ జేడీ శీలంలు రాహుల్ గాంధీని.. ఎయిర్ పోర్ట్లో కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆయనకు వినతిపత్రం ద్వారా వివరించారు. కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని రుద్రరాజు అన్నారు. రాహుల్ గాంధీ రాక.. రాష్ట్రంలో నూతనోత్సాహం నింపిందన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధిస్తుందన్నారు. జులై చివరి వారం లేదా ఆగష్టు మొదటి వారంలో రాహుల్ విశాఖ పర్యాటన ఉంటుందని తెలిపారు. బీజేపీ, మిత్ర పక్షాలను ప్రజలు వ్యతిరేకించే సమయం వచ్చిందన్నారు. గత తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ ఆస్తులు అమ్మకం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే యువతకు ఉపాధి.. ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ పెత్తనాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు.