ఉద్యోగుల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు:బొప్పరాజు - ఏపీ ఐక్య కార్యచరణ సమితి అమరావతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18200221-141-18200221-1680938716145.jpg)
AP JAC AMARAVATI CHAIRMAN BOPPARAJU INTERVIEW: పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మెరుగ్గా ఉందని ఏపీ ఐక్య కార్యచరణ సమితి(AP JAC) అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి రికవరీ కారణంగా ఉద్యోగులు 6 వేల కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించలేదని మండిపడ్డారు. వేతనాలు సమయానికి ఇవ్వమన్నా.. హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని బొప్పరాజు హెచ్చరించారు. పీఆర్సీ అరియర్స్ ఇంతవరకూ ఇవ్వలేదని.. 11పీఆర్సీ పే సేల్స్ ఇప్పటి వరకూ ఇవ్వలేదని విమర్శించారు. 11 పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఒక్కరూపాయి కూడా జీతం పెరగలేదని వాపోయారు. ఉద్యోగుల మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టి నాలుగు స్తంభాలాట ఆడుతోందంటున్న ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.