ఉచిత ఇసుక కేసులో ముగిసిన వాదనలు - చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
🎬 Watch Now: Feature Video
AP High Court reserves verdict on Chandrababu Anticipatory Bail Petition: ఉచిత ఇసుక కేసులో, ముందస్తు బెయిల్ కోరుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు ముగిశాయి. హైకోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ, తరఫున సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించి పలు అంశాలు చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. కక్షపూరితంగా చంద్రబాబును కేసులో ఇరికించారని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టినట్లు లూథ్రా వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సీఐడీ ఆరోపణలు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఉచిత ఇసుక పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందనే ఆరోపిస్తూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై సీఐడీ చంద్రబాబుతో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. ఇసుక విధానం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించడమే కాకుండా, విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టారని సీఐడీ ఆరోపించింది.