Ginger Water Benefits : దాదాపు మనందరి ఇళ్లలో అల్లం తప్పకుండా ఉంటుంది. టీ అద్దిరిపోవాలన్నా, కూరలు ఘుమఘుమలాడాలన్నా చిన్న అల్లం ముక్క తప్పక ఉండాల్సిందే! ఇలా అల్లంతో అనేక ప్రయోజనాలు ఉండడంతో వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు చాలా మంది. అయితే, కాస్త తలనొప్పిగా అనిపించినప్పుడు అల్లం ముక్కలు టీలో వేసుకోవడం మనందరికీ తెలిసిందే. కానీ అల్లం నీళ్లు తాగడం వల్ల కూడా చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కూడా ఈ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకు ఒక్కటి చాలు! - అద్దిరిపోయే పులుసు మీ ముందు!
- అల్లం నీళ్లు తాగటం వల్ల శరీరానికి పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, కోలిన్, సెలీనియం వంటివి అందుతాయి.
- అలాగే వాంతులు, వికారం, నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ థెరపీ పెయిన్ కిల్లర్ల కంటే బాగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.
- రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
- కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
- కడుపుబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
- బాడీ డీహైడ్రేట్ అవదు.
- బరువు తగ్గాలనుకునేవారు అల్లం నీళ్లు తాగటం మేలు.
- గర్భిణులు తగిన మోతాదులో ఈ వాటర్ తాగటం మంచిది.
- అయితే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రం అల్లం వాటర్ తాగకపోవటమే మంచిది. లేదంటే విరేచనాలు, కడుపునొప్పి, గుండెమంట లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!
జింజర్ ఇన్‌ఫ్యూజ్‌డ్ వాటర్ ఇలా చేసేద్దాం :
- నాలుగు కప్పుల వాటర్‌లో ఒకటిన్నర చెంచా అల్లం తరుగు వేసి మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. 10 నిమిషాలు అలా ఉంచేసి, తర్వాత వడకట్టాలి. పూర్తిగా చల్లారాక తాగితే సరి.
- ఘాటు తాగలేమనుకుంటే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.
ఎసిడిటీ నివారణ కోసం :
జలుబుతో ఇబ్బందిపడుతుంటే మిరియాలు, ఆకలి మందగిస్తే అల్లం ఇలా మన పెద్దవాళ్లు కొన్ని చిన్న సమస్యల్ని చిట్కాలతో తగ్గించేస్తుంటారు. ఇలా అనేక ఔషధాలు మన కిచెన్లోనే ఉంటాయి. వాటిల్లో వాము ప్రధానమైనది. వాము, సోంపు, జీలకర్ర జతచేసిన నీళ్లు తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీన్నెలా చేయాలంటే?
- రెండు కప్పుల వాటర్‌లో వాము, సోంపు, జీలకర్రలను చెంచా చొప్పున వేయాలి. ఆపై సన్నని సెగ మీద ఆరేడు నిమిషాలు మరిగించాలి. ఆపై వడకట్టేసి తాగాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మరింత మేలు. ఈ వాటర్ తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు చూద్దాం.
- ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
- జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. టైమ్‌కి ఆకలి వేస్తుంది.
- ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
- అధిక బరువుతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
- ఊపిరితిత్తులు హెల్దీగా ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
- రక్తంలో షుగర్ స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది.
- మహిళలు నెలసరి సమయంలో వచ్చే బాధల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అమ్మో! 'స్ట్రాంగ్ టీ' అంత పని చేస్తుందా? - చాయ్ ప్రియులూ పారా హుషార్!
తిరుమలలో గోవిందా, గోవిందా అని ఎందుకంటారో తెలుసా? - అసలు విషయం ఇదీ!