AP High Court on CBN Angallu Bail Petition: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో తీర్పు రిజర్వ్... - తెలుగుదేశం అధినేత చంద్రబాబు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 7:47 PM IST
AP High Court on CBN Angallu Bail Petition అంగళ్లు ఘటనలో తనకు బెయిల్ మంజూరుచేయాలని కోరుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సాగునీటి ప్రాజెక్టు సందర్శనకోసం చంద్రబాబు వెళ్లిన సందర్భంలో అంగళ్లు వద్ద టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ కేసులో పిటిషనర్ చంద్రబాబు (Chandrababu) తరుపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబుపై అధికార పార్టీ నేతలే దాడి చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ, తిరిగి వాళ్లే కేసు పెట్టారని ఆరోపించారు. అక్కడ చంద్రబాబుపై రాళ్లు రువ్విన ఘటనలో ఎన్‌ఎస్‌జి కమాండర్స్ ఆయనను కాపాడారని కోర్టు దృష్టికి తెచ్చారు. బాధితులమీదే కేసు నమోదుచేయడం సరికాదని పోసాని వాదించారు. ఈకేసులో ఇప్పటికే చాలామందికి బెయిల్, మరికొందరికి ముందస్తు బెయిల్ (Bail) కూడా మంజూరు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో నారా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.