మద్యం కేసు పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు- తీర్పు రిజర్వ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 10:42 AM IST
AP High Court Reserved Judgment in Liquor Case: మద్యం కేసులో ముందస్తు బెయిలు కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాస శ్రీనరేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీనివాస్ శ్రీనరేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ ఐఏఎస్ శ్రీనివాస్ శ్రీనరేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ పాత్ర ఉండదన్నారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున న్యాయవాది శివకల్పనా రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ సిఫారసుతో ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందన్నారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.