ఊరు వెళ్లేందుకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు రక్షణ కల్పించండి: హైకోర్టు - AP High Court
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 8:03 PM IST
AP High Court on MP Raghu Rama Krishna Raju Petition: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఊరట దక్కింది. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని రఘురామ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. 41-ఏ ప్రొసీజర్ ఫాలో అవుతూ రఘురామకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. పోలీసులు రఘురామపై 11 కేసులు నమోదు చేశారని తెలిపారు. గతంలో రఘురామను అరెస్టు చేసి హింసించారని పేర్కొన్నారు. మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నందున 41-ఏ నిబంధనలు పాటిస్తూ పిటిషనర్‌కు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈరోజుకి వాయిదా వేసింది. ఈరోజు వాదనలు విన్నాక రఘురామ ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని ఉత్తర్వులిచ్చింది.