విశాఖకు క్యాంపు కార్యాలయాలు తరలింపు​ - సోమవారానికి తదుపరి విచారణ వాయిదా - విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపు పిటిషన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 4:03 PM IST

AP HC Hearing on Camp Offices Shift to Visakha: విశాఖకు క్యాంపు కార్యాలయాలను తరిలించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్​ చేస్తూ, దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై శుక్రవారం రోజున కోర్టులో ఇరువైపులా వాదనలు వినిపించగా, న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని రాజధాని పరిరక్షణ సమితి జీవో నెం. 2283ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని రాజధాని పరిరక్షణ సమితి కోరింది.

ప్రభుత్వ తరపున ఏజీ శ్రీరామ్, పిటిషన్​కు విచారణార్హత లేదని వాదనలు వినిపించారు. ఇది ఫోరం ఫర్​ షాపింగ్​ కిందకు వస్తోందని వాదించారు. పిటిషనర్ల తరపున సీనియర్​ న్యాయవాది ఉన్నం మురళీధర్​ వాదనలు వినిపించారు. ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘిస్తోందని పిటిషనర్​ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. సోమవారం రోజున మెరిట్స్​పై వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.