compassionate appointment : కారుణ్య నియామకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు... - ap government employees
🎬 Watch Now: Feature Video
AP Govt issues compassionate appointment : కొవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటంబాల్లోని వారికి కారుణ్య నియామకానికి అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామవార్డు సచివాలయాల్లో ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 917 మంది ఉద్యోగులు మృతి చెందినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 2వేల 744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. 107 మంది వివిధ కారణాలతో అనర్హులుగా ఉన్నట్లు తెలిపింది. ప్రత్యేక డ్రైవ్ కింద అర్హులైన వారికి గ్రామవార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకుగానూ ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో ఉద్యోగ కల్పన ప్రభుత్వం కృషి చేస్తుంది. 2023 ఆగస్టు 24 తేదీనాటికల్లా నియామక పత్రాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.సెప్టెంబరు 30 తేదీనాటికి ఈ నియామకాలకు సంబంధించిన కాంప్లయన్సు రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.