AP Financial Condition Degraded: మరింత దిగజారిన రాష్ట్ర ఆర్థిక స్థితి.. బడ్జెట్ విశ్లేషణ ఆధారంగా ర్యాంకులు - ఆంధ్రప్రదేశ్ అప్పుల వడ్డీ
🎬 Watch Now: Feature Video
AP Financial Condition Degraded: రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత దిగజారింది. 2022-23 సవరించిన బడ్జెట్ల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన రాష్ట్రాల ర్యాంకుల్లో.. ఏపీ 11వ స్థానానికి పడిపోయింది. మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 17 రాష్ట్రాలపై డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థిక వేత్త కౌశిక్ దాస్ ఈ నివేదికను తయారు చేశారు. 2023-24 మొదటి బడ్జెట్ అంచనాల ఆధారంగా కౌశిక్ దాస్ రూపొందించిన నివేదిక ప్రకారం.. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023-24కు సంబంధించిన ఏపీ ర్యాంకు వివరాలు తెలియరాలేదు. రాష్ట్రాల ఆర్థిక స్థితిని బడ్జెట్లను విశ్లేషించి 4 అంశాల ఆధారంగా కౌశిక్ దాస్ ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఆర్థిక లోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పుల స్థాయి, జీఎస్‌డీపీ శాతాలను ఈ ర్యాంకుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. రెవెన్యూ ఆదాయం నుంచి చెల్లించే అప్పుల వడ్డినీ లెక్కలోకి తీసుకున్నారు.