శాంతియుత పోరాటానికి 'సబ్కా' పిలుపు - సహాయ నిరాకరణకు వెనుకాడేదిలేదని కాంట్రాక్టర్ల స్పష్టీకరణ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 7:35 PM IST
AP Contractors Union Protest In Vijayawada : టెండర్లు దక్కించుకోడానికి పోటీలు పడినట్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడంలోనూ సమర్థులమనే రీతిలో ఐక్యత చాటేందుకు తరలిరావాలని రాష్ట్ర భవన నిర్మాణ గుత్తేదారుల సంఘం- సబ్కా... పిలుపునిచ్చింది. విజయవాడ ధర్నాచౌక్‌లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి బిల్డర్స్ అసోయేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖతో కలిసి శాంతియుత పోరాటానికి సమాయత్తమైంది. తమ ఆవేదనను గుర్తించకపోతే సహాయ నిరాకరణ నిర్ణయానికి వెనుకాడేది లేదని ప్రకటించబోతున్న సబ్కా గుత్తేదారులతో ఈటీవీ ముఖాముఖి.
Sabka Protest In ap 2023 : గుత్తేదారుల సంఘం.. 'సబ్కా' ఆధ్వర్యంలో శాంతియుత పోరాటానికి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించటంలేదని కాంట్రాక్టర్లు నిరాశ చెందారు. సామాన్య గుత్తేదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత, ప్రాధాన్యత లేదని గుత్తేదారులు వాపోయారు. సీఎంఎఫ్‌ఎస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆందోళన చెందారు.