Antiquity Coins and Vessels in Mangalagiri: పెద్దకోనేరులో పురాతన నాణాలు, పాత్రలు లభ్యం.. మీరు చూశారా..? - Antiquity Coins and Vessels

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2023, 2:18 PM IST

Antiquity Coins and Vessels Found in Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరి పెద్ద కోనేరులో పురాతన నాణేలు, పాత్రలు లభించాయి. కోనేరులో నీటిని తోడేందుకు గత 8 నెలలుగా పూడికతీత పనులు చేస్తున్నారు. పూడికతీత పనుల్లో సుమారు 30 నాణేలు, 8 పాత్రలు లభించాయి. వీటిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కోనేరులో దొరికిన ఈ సంపదను పురావస్తు శాఖకు అప్పగిస్తామని తహశీల్దార్‌ తెలిపారు. ఆ శాఖ నివేదిక ప్రకారం వాటిని ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

"మంగళగిరి కోనేరులో దొరికిన నాణేలు, పాత్రలను అధికారులు సమక్షంలో ఇన్వెంటరీ తయారు చేసి ఈ జాబితాకు పంచనామా నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకుంటున్నాం. స్వాధీనం చేసుకున్న వాటిని ఇండియన్​ ట్రెజర్​టు యాక్ట్​ కింద జిల్లా కలెక్టర్​కు అందజేస్తాం. అనంతరం ఈ నాణేలపై ఎవరైనా క్లెయిమ్​ చేస్తే పరిశీలించి వారికి అప్పగిస్తాం. లేకుంటే ప్రభుత్వానికి అందజేస్తాం"-జీవీ రాంప్రసాద్, తహశీల్దార్ మంగళగిరి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.