ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దళిత బాలికపై అత్యాచారం: వంగలపూడి అనిత - దళిత బాలికపై అత్యాచారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 4:15 PM IST
Anita on Dalit Girl Gang Raped in Visakhapatnam : విశాఖలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరగడం దారుణమని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు. రెండు వాారాల క్రితమే బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడమే ఘటనకు కారణమన్నారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని అరాచకాలు జరుగుతున్నా ఏ మాత్రం కఠిన చర్యలు తీసులేదని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్ మహిళలపై ఎక్కువ దాడులు జరిగే రాష్ట్రంగా ఏపీని మార్చారని అనిత వ్యాఖ్యానించారు. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రం నుంచి విశాఖకు వలస వచ్చిన దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరగడం దారుణమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని మహిళ కమిషన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఉద్ఘాటించారు. మహిళ రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్ పని చేసి ఉంటే బాలికపై అత్యాచారం జరిగేదా అని ప్రశ్నించారు.