ప్రభుత్వానికి మాపై కక్ష ఎందుకు? - చర్చలకు పిలవకుంటే ఆందోళన ఉద్ధృతం: అంగన్వాడీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 3:32 PM IST

Updated : Jan 11, 2024, 10:44 PM IST

thumbnail

Anganwadi Workers Protest at Vijawada: పారిశుద్ధ్య, ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వం తమపై కక్షసాధిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. కనీస వేతన పెంపు సహా డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే రానున్న ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. అంగన్వాడీలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తోందని కార్యకర్తలు మండిపడ్డారు. ప్రభుత్వం ఎస్మా పేరిట భయపెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు.

విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళన : ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మాని వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు పేర్కొన్నారు. కనీస వేతనాలు, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించి, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. తక్షణం తమను చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించిన అంగన్వాడీలు ప్రభుత్వం సమస్యను సామరస్యంగా పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Last Updated : Jan 11, 2024, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.