Anganwadis Protest: సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Anganwadi Workers Agitation : అంగన్వాడీ కేంద్రాలకు కనీసం గ్యాస్ కూడా సరఫరా చేయలేని అధికారులు.. అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురి చేయడం తగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వైఎస్సార్ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి అన్నారు. అంగన్వాడీలు తమ సొంత డబ్బులను అంగన్వాడీ కేంద్రాలకు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప అర్బన్ అంగన్వాడీ కేంద్రం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అద్దె చెల్లించకపోవడంతో నెలల తరబడి నుంచి అద్దె పెండింగ్లో ఉన్నాయని.. యజమానులు అద్దె చెల్లించాలని వేధిస్తున్నారని చెప్పారు.
అంగన్వాడీ సమస్యలు సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ వారు నోరు మెదపకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి, అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తే తాము సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది పోరాటాలు చేసి సాధించుకున్న సమస్యలను కూడా అధికారులు పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు. జిల్లాలోని అంగన్వాడీ సమస్యలపై జూలై 11, 12 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను మూసేసి కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.