అంగన్వాడీల సమ్మెతో సచివాలయ సిబ్బందికి తిప్పలు - పిల్లలను బడులకు రప్పించలేక ఆపసోపాలు - prakasam update news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 8:00 PM IST
Anganwadi School : అమ్మ మీ పిల్లలను అంగన్వాడీ బడులకు పంపించమని సచివాలయ సిబ్బంది తల్లిదండ్రులను అడిగితే, మీరు ఎవరో మాకు తెలిదని సమాధానం ఇస్తున్నారు. ముక్కు, మోహం తెలిని వాళ్లు వచ్చి అడిగితే మా పిల్లలను ఎలా పంపించాలని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్వాడీ టీచర్లులకు, ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సచివాలయ సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సచివాలయ సిబ్బందికి ఈ చేదు అనుభవం ఎదురైంది
Difficulties of Secretariat Staff : ప్రభుత్వ తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టిన విషయం తెెలిసిందే. వారి ఆందోళనలతో మూతపడిన అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించేలా రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలను మాత్రం తెరిపించారు కానీ అందులో పిల్లలు మాత్రం లేరు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు తీసుకురావాలంటే సచివాలయ సిబ్బందికి కత్తి మీద సాము లాంటిదే.