SC,ST Atrocity Act misused ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ... రెడ్డి కులస్థులు ఆందోళన - Reddy caste protested
🎬 Watch Now: Feature Video
Reddy caste protested SC,ST Atrocity Act misused : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో రెడ్డి కులస్థులు రాస్తారోకో చేపట్టారు. ఆడపిల్లలను ఏడిపిస్తున్నారని.. మందలించినందుకు తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని రెడ్డి సంఘం నేతలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఆ గ్రామంలో పర్యటించారు. ఆయన దగ్గర రెడ్డి మహిళలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న చోద్యం చూస్తూ అన్యాయంగా పోలీసులు కేసుల నమోదు చేస్తున్నారన్నారు. నిరసనగా ర్యాలీగా వెళ్లి కొండాపురం జాతీయ రహదారిపై శనగల గూడూరు గ్రామ రెడ్డి కులస్తులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు నిరసనకారులను అపేందుకు యత్నించారు. దీంతో ఇరువురి మధ్య తోపులాటలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలి లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.