Govt Permits to Provide Industrial Incentives in AP: తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 మేరకు ఎల్జి ఉపకరణాల ఉత్పత్తి ప్లాంట్‌కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లు వాషింగ్ మెషిన్లు కంప్రెసర్ల ఉత్పత్తికి ఎల్జి యూనిట్ ప్రారంభించనుంది. 5000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఎల్జి ఎలక్ట్రానిక్స్ పెడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్లాంట్ ఏర్పాటుకు శ్రీసీటిలో 247 ఎకరాలు అవసరం అని ఎల్జి ఎలక్ట్రానిక్స్ సంస్థ తెలిపింది.
ఇందులో 188 ఎకరాలను సేకరణకు ప్రభుత్వం ఏపీ ఐఐసీకి అనుమతి ఇచ్చింది. వాస్తవ ధరకే భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సు మేరకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు స్పెషల్ ప్యాకేజీ కింద ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మొత్తం పెట్టుబడులపై 100 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలు 20 ఏళ్ల పాటు ఇచ్చేందుకు నిర్ణయించింది. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు ఇవ్వనుంది. 20 ఏళ్ల పాటు 100 శాతం సబ్సిడీతో నీటి సరఫరాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 20 ఏళ్ల పాటు 100 శాతం విద్యుత్ డ్యూటీ మినహాయింపుకు ఆమోదం తెలిపింది. 5 ఏళ్ల పాటు ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేసే కార్మికులకు నైపుణ్యాభివృద్ధి సబ్సిడీ కింద నెలకు 6 వేల చొప్పున ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్
స్టీల్ ప్లాంట్‌కు ప్రోత్సాహకాలు: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు చెందిన సమీకృత స్టీల్ ప్లాంట్‌కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు కల్పనకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆర్సేలార్ మిట్టల్ నిప్పన్ సంస్థ 2 దశల్లో ఏడాదికి 17 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయనుంది. రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
రెండు దశల్లోనూ 60 వేల ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మిట్టల్ సంస్థ ప్రతిపాదన చేసింది. రెండు దశల్లోనూ రూ.1,35,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. మొత్తంగా 55,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ఆర్సెలర్ మిట్టల్ స్పష్టం చేసింది. 2029 నాటికి మొదటి దశ 2033 నాటికి రెండోదశ యూనిట్లను పూర్తి చేయాలని నిర్ణయించింది. మూలధన పెట్టుబడిపై 50 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!
ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్స్టేషన్లు : చంద్రబాబు