కేసులు నమోదు చేయని పోలీసులపై చర్యలు - కాగ్నిజబుల్ నేరాలపై హైకోర్టు వ్యాఖ్యలు - AP High Court Comments on Cognisable offence
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 9:10 PM IST
Andhra Pradesh High Court on Cognisable Offence: కాగ్నిజబుల్ నేరాలపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు కట్టకపోవడంపై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేరాలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేయడం, ఒకవేళ చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. లలిత కుమారి వర్సస్ యూపీ ప్రభుత్వం (Lalita Kumari vs Govt of UP) కేసులో సుప్రీం తీర్పును తెలుగులోకి అనువదించి రాష్ట్రంలో ఉండే పోలీసులు అందరికీ పంపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఒకవేళ కాగ్నిజబుల్ నేరాల్లో కేసులు నమోదు చేయకపోతే పిటిషనర్‌కు ఎందుకు చేయలేదో చెప్పాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖపట్నంలో తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయక పోవడంపై ఇరువురు పిటిషనర్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లు తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇక ముందు కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు తీర్పు అనువాద కాపీతో కలిపి పోలీస్ స్టేషన్లలో ఇస్తామని న్యాయవాది తెలిపారు.