అనంతపురం పోలీసుల అరుదైన రికార్డు - సెల్​ఫోన్ల రికవరీలో నంబర్​ వన్​ - cell phone recovered in anantapur

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 7:41 PM IST

Anantapur Police Chat Bot : చాట్​ బాట్​ సేవల ద్వారా అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డు సాధించారు. ఎక్కడైనా పోగొట్టుకున్న, అపహరణకు గురైన ఫోన్లను రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిచారు.  రెండేళ్ల క్రితం సెల్​ఫోన్​ చోరీలు అధికమవుతున్న సమయంలో జిల్లా పోలీసులు చాట్​ బాట్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవల ద్వారా ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు లేకుండా కేవలం వాట్సాప్​ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి ఫోన్లు రికవరీ చేస్తున్నారు. అనంతపురం పోలీసులు చేపట్టిన చాట్​ బాట్​ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అమలవుతోంది. 

Police Officials Recovered Cell Phone : తాజాగా అనంతపురం జిల్లా పోలీసులు ఫోన్లు రికవరీలో 8 వేల మార్కును దాటారని జిల్లా ఎస్పీ అన్బురాజన్​ వెల్లడించారు. తాజాగా రూ.71 లక్షల విలువ చేసే 385 సెల్​ఫోన్లను బాధితులకు అందజేశారు. రికవరీ చేసిన సెల్​ఫోన్లు ఆంధ్రప్రదేశ్​లోని 9 జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాలకు వెళ్లినా వదలకుండా రికవరీ చేసినట్లు వెల్లడించారు. సెల్​ఫోన్​ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని సూచించారు. ఫోన్ల విషయంలో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.