Bus Overturned In Tirumala: తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు - తిరుమలలో బస్సు బోల్తా
🎬 Watch Now: Feature Video
Electric Bus Overturned In Tirumala: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వచ్చే విద్యుత్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్ బస్సు లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులను వెంటనే రుయాకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది భక్తులు ప్రయాణికులు ఉన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళుతున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. తక్షణమే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఎస్పీఎఫ్ సిబ్బంది భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు భక్తులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన భక్తులను వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.