Ambati Vs Kanna: కన్నా వారి ఇంటిముందు.. ఎన్ని పార్టీల ఫ్లెక్సీలు మారాయో..!: అంబటి - AP Latest News
🎬 Watch Now: Feature Video
Ambati Rambabu comments on Kanna: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పదవి కోసం పాకులాడే వ్యక్తి అంటూ కన్నాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు చంద్రబాబును తిట్టిన కన్నా.. ఇప్పుడు ఆయన బొమ్మలకు పాలాభిషేకం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సత్తెనపల్లిలో కన్నా ఇంచార్జ్ మాత్రమేనని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడో.. పారిపోతాడో తెలియదని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ఖర్చు కోసం బీజేపీ అధిష్టానం నిధులు పంపితే.. దాన్ని కాజేసిన ఘనత కన్నాదని.. ఈ సంగతి అమిత్ షా సహా బీజేపీ నేతలు చెబుతారని విమర్శించారు. కన్నా వారి తోటలో ఆయన ఇంటిముందు ఎన్ని పార్టీల ఫ్లెక్సీలు మారాయని ప్రశ్నించారు. కన్నా నోరు అదుపులో పెట్టుకోవాలని.. చంద్రబాబు మీద విమర్శలు చేసినట్లు చేస్తే వైసీపీ సహించదని హెచ్ఛరించారు.