'ఇదేంది రాంబాబూ?' - లాటరీ కోసం పింఛన్​దారుల సొమ్ము స్వాహా

🎬 Watch Now: Feature Video

thumbnail

Ambati Followers Collecting Pensioners Money to Sankranti Luckydip : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లాటరీ పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల నుంచి పెన్షన్ 3వేల రూపాయలకు పెరగ్గా అందులో నుంచి సంక్రాంతి సంబరాల లక్కీడిప్ టికెట్ పేరిట ఒక్కొక్కరి నుంచి వంద రూపాయల చొప్పున దండుకుంటున్నారు. లక్కీడిప్‌ టికెట్లు వద్దని పూర్తి నగదు ఇవ్వాలని కొందరు పెన్షనర్లు అడిగితే పింఛన్లు 3 వేలకు పెరిగాయి కదా, వంద రూపాయలు ఇవ్వలేరా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెలలో 40 వేల 615 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరి నుంచి వంద చొప్పున తీసుకుంటే 40 లక్షల 61 వేల వరకు వసూలవుతాయి. ఆ సొమ్మునే లాటరీ లక్కీడిప్ విజేతలకు బహుమతులుగా అందించేందుకు మంత్రి అంబటి అనుచరులు ప్రణాళిక వేశారు. జనం సొమ్ముతోనే లక్కీడిప్ విజేతలకు బహుమతులు అందించి, క్రెడిట్ కొట్టేసేలా అంబటి అనుచరులు ప్రణాళిక వేయడం విమర్శలకు తావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.