Amaravati Farmers: రాజధాని కోసం అమరావతి రైతులు ఆలయాల సందర్శన యాత్ర.. - అమరావతి రైతులు ఆలయంలో పూజలు
🎬 Watch Now: Feature Video
Amaravati Farmers worship at temple: ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు ఆలయాల సందర్శన యాత్ర చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉద్యమం ప్రారంభించి 1300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆలయాల సందర్శన యాత్ర చేపట్టామని రైతులు చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడినే వచ్చే ఎన్నికలలో గెలిపించాలని దేవుళ్లను వేడుకుంటామని రైతులు తెలిపారు. నాలుగేళ్లలో అమరావతిని అంతం చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రానికి సీఎం పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితి గురించి ఒక్కసారి కూడా సీఎం జగన్ ఆలోచన చేయలేదని రైతులు పలు విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు. రేపటితో అమరావతి ఉద్యమం 1,300 రోజులకు చేరుకోనున్న నేపధ్యంలో రాజధాని రైతు ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.