thumbnail

Prathidwani: మడమ తిప్పిన జగన్​కు.. అమరావతి రైతుల కన్నీళ్లు కనిపిస్తున్నాయా..?

By

Published : Jul 8, 2023, 10:04 PM IST

Amaravati Farmers Protest: రాష్ట్రం కోసం.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం.. అడిగిన వెంటనే.. పాడిపంటలతో అలరారే తమ భూముల్ని రాజధాని కోసం ఇవ్వడమే పాపమైంది. నమ్మించి గొంతు కోసిన రీతిలో అడ్డంగా మడమ తిప్పేసిన జగన్‌ ప్రభుత్వం తీరుతో ఇప్పుడు వారి వేదనంతా అరణ్య రోదన అవుతోన్న అమరావతి రైతులు వేదన ఇది. రాష్ట్రం బాగుంటుందని.. రేపటి తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని.. రాజధాని కోసం 34 వేల 323 ఎకరాల భూములు ఇచ్చిన 29 వేల 881 మంది రైతుల వ్యథ ఇది. కచ్చితంగా చెప్పాలంటే 2019 డిసెంబర్ 17వ తేదీన ప్రారంభమైన ఈ ఉద్యమం అవిశ్రాంతంగా కొనసాగుతునే ఉంది. ఇప్పడు 1300 రోజులకు అమరావతి రైతుల ఉద్యమం చేరుకుంది. అసలు.. నాడు రాజధానిగా అమరావతి ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న అదే జగన్మోహన్‌రెడ్డి పాలనలో.. అమరావతి రైతులకు ఇన్ని కష్టాలు, కన్నీళ్లు ఎందుకు?. నిజంగా అమరావతి ఏ ఒక్క కులానికో పరిమితమా? భూములిచ్చిన వారంతా ఒక కులం.. భూస్వాములేనా? ఎకరం లోపు భూమిని ఇచ్చిన రైతులు 20 వేల మందికి పైగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు 32%, బీసీలు 14% మంది అమరావతి కోసం భూములిచ్చారు. కాపులు 9%, మైనార్టీలు 3% ఇచ్చారని లెక్కలు చెబుతున్నాయి. అమరావతి రైతుల 1300 రోజుల ఉద్యమం కన్నీళ్లు జగన్‌కు కనిపిస్తున్నాయా? ఎందుకింత ఉసురు పోసుకుంటున్నారని రైతుల ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.