Amaravati Farmers Protest on CBN Arrest: బాబు అరెస్టుపై భగ్గుమన్న అమరావతి రైతులు.. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు.. - అమరావతి రైతులు లేెటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2023, 4:34 PM IST
Amaravati Farmers Protest on CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోయినా అరెస్టుకు తెగబడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత కక్షతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అరెస్టులేంటంటూ.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ఇలాంటి అరాచక ప్రభుత్వానికి గద్దె దించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.
"టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయటం చాలా దారుణం. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకపోయినా చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తలకొరివిపెట్టిన రోజు ఇది. కేవలం తన కక్ష, పగతో చంద్రబాబును అరెస్టు చేశారు. ఎప్పుడెప్పుడు బాబును అరెస్టు చేయాలా.. అని ఉవ్విళ్లూరుతూ.. ఆయనను అరెస్టు చేసి.. సీఎం తన కోర్కెను తీర్చుకున్నారు. అర్ధరాత్రి సమయంలో భయకంపితుల్ని చేసి.. చట్టానికి, న్యాయానికి సహకరించే చంద్రబాబులాంటి వ్యక్తిని అరెస్టు చేశారు. పురాణాల్లో రాక్షసులు రాత్రి సమయంలో సంచరించి మనుషుల రక్తాన్ని తాగి.. ఎత్తుకుపోతారు. అదేరీతిలో వైసీపీ రాక్షస పాలనలో రాత్రి సమయంలో అరెస్టులు చేస్తున్నారు." - అమరావతి రైతులు