Amaravati Farmers Meet Purandeswari: అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడండి.. పురందేశ్వరితో అమరావతి రైతులు - అమరావతి రైతులు
🎬 Watch Now: Feature Video
Amaravati Farmers Meet Purandeswari: అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు జారీ చేయించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు, రైతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తోందంటూ వాటి గురించి వివరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన రాజధాని ప్రాంత రైతులు, మహిళల బృందం.. రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి అక్కడి పరిస్థితులను తెలియజేశారు. ఆర్- 5 జోన్ పేరిట అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని ఆవేదన చెందారు. రాజధాని రైతుల ఇబ్బందులను.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ ప్రాంతంలో పర్యటించాలని పురందేశ్వరిని ఆహ్వానించారు. దిల్లీ స్థాయిలో అమరావతి రైతుల కష్టాలను తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు అమరావతి రైతులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని భూములలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. దిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేలా చూడాలని కోరినట్లు అమరావతి రైతులు తెలియజేశారు.