Amaravati Farmers Happy on R 5 Zone Judgement హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు
🎬 Watch Now: Feature Video
Amaravati Farmers Happy on High Court Judgement on R5 Zone Issue: ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను ఆపివేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. R-5 జోన్ చట్టవ్యతిరేకమని మొదటి నుంచీ చెబుతున్నామని.. కానీ రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం పేదలతో ఆడుకుందని మండిపడ్డారు. రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షసాధింపుతోనే ప్రభుత్వం ఆర్5 జోన్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. రైతుల అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలి హితవు పలికారు. వ్యక్తిగతంగా తీసుకోకుండా తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ఆపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం పని చేయాలని సూచించారు.పేదలకు వారి వారి ప్రాంతాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం... ఇళ్ల నిర్మాణంపై స్టే విధించింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.