Amaravati Farmers Happy About Supreme Court's Decision on R5 Zone: R5 జోన్‌లో ఇళ్ల అంశం.. సుప్రీంకోర్టు నిర్ణయంపై అమరావతి రైతుల హర్షం - Amaravati Farmers news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 9:20 PM IST
Amaravati Farmers Happy About Supreme Court's Decision on R5 Zone: R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం అంశంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ప్రాజెక్ట్ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నందున కొంతకాలం వేచి చూడాలని ప్రభుత్వానికి హితవు పలికింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. నవంబర్‌కు విచారణను వాయిదా వేసింది.
Amaravati Farmers are happy: సుప్రీంకోర్టు నిర్ణయంపై అమరావతి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల ముసుగులో ఆడిన జగన్నాటకానికి సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టని రైతులు వ్యాఖ్యానించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించాలని హితవు పలికారు. ఆర్-5 జోన్ కోసం, రాజధాని అమరావతి కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని రైతులు తేల్చి చెప్పారు. ఇకపై జగన్ ప్రభుత్వం ఉత్తిత్తి కార్యక్రమాలు చేపట్టకుండా.. అమరావతి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని ప్రజాధనాన్ని ఖర్చు చేయొద్దని, అమరావతిలో ఉన్న పేద ప్రజలను గుర్తించి వారికి ఇళ్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు.