'చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం శుభ పరిణామం - నిజం గెలిచింది'
🎬 Watch Now: Feature Video
Amaravati Conservation Committee Leader Sudhakar on CBN Bial: చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడం రాష్ట్రానికి, అమరావతి రైతులకు శుభ పరిణామం అని పేర్కొన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టులో చంద్రబాబుపై అక్రమంగా బనాయించిన కేసు క్వాష్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో.. చట్టంపై తమకు ఉన్న నమ్మకం.. నిజమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Bail Granted to Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ మంజూరైంది. మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఇటీవలే వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయావాది సిద్దార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు ఉండగా.. పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15వ తేదీన వాదనలు జరిగాయి. కానీ ఆరోజు పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. వాదనలు ఆ రోజు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ చేసిన న్యాయస్థానం.. ఈవాళ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కొంత ఆలస్యమైన న్యాయం జరిగిందంటున్న అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు సుధాకర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..