రాజీనామా తర్వాత పార్టీ నేతలతో తొలిసారి భేటీ అయిన ఆర్కే

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 10:39 AM IST

Alla Rama Krishna Reddy Met  YCP Leaders First Time After Resigning from YCP: వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. వైఎస్సార్​సీపీకి రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా గుంటూరు జిల్లా పెదకాకాని తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి ఆయన సమావేశమయ్యారు. మూడోసారి మంగళగిరి నుంచి పోటీచేయాలని వైఎస్సార్​సీపీ నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఇక పోటీలో దిగే అవకాశం లేదని ఆర్కే చెప్పినట్లు వారు పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తానని నేతలకు ఆర్కే స్పష్టం చేశారని పార్టీ నేతలు తెలిపారు. 

ఈసారి ఎన్నికల్లో ఆర్కే పోటీ చేయకపోతే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ సులువుగా విజయం సాధిస్తుందని, రాజీనామాపై ఆర్కే పునరాలోచన చేయాలని వైఎస్సార్​సీపీ నేతలు గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ ఇన్​ఛార్జ్​గా బాధ్యతలు తీసుకున్న చిరంజీవి ఆర్కేను కలిసేందుకు వెళ్లగా ఎమ్మెల్యే లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.