"సెక్షన్ 106 - హిట్ అండ్ రన్ చట్టాన్నిరద్దు చేయాలి" - Truck Drivers Protest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 12:16 PM IST
All India Truckers and Drivers Helpline Association : రవాణా రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న కార్మికులపై శరాఘాతంలా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని (Hit and Run Law), సెక్షన్ 106 (Section 106)ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ సంఘం డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Hit and Run Law Protest : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రీన్ టాక్స్ ఇతర పన్నులు, జరిమానాల రూపంలో మోయలేని భారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోందని ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సెక్షన్ 106 చట్టంతో రవాణా రంగాలు ఉపాధిగా మలుచుకోవాలనుకున్న కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.