రైతుల సొమ్మును జగన్ బంధువులు కాజేయడానికే స్మార్ట్ మీటర్ల పథకం- అఖిలభారత కిసాన్ సభ - All India Kisan Sabha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 9:10 PM IST
AIKS Opposes Installation of Smart Meters for Agricultural Motors: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య స్పష్టం చేశారు. రెండో రోజు ఏఐకేఎస్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు వినియోగిస్తున్న విద్యుత్ గురించి ప్రభుత్వానికి తెలుసని ఒక్కో మీటర్‌పై 30 వేలకు పైగా వెచ్చించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పంటల భీమా పథకం ద్వారా 14 కార్పొరేట్ కంపెనీలు లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా మీటర్‌పై వెచ్చించే సొమ్ము అంతా కూడా సీఎం జగన్ బంధువుల కాజేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల పాడి రైతులు ఉన్నారని ఒక్కో లీటర్‌కు 4 రూపాయలు బోనస్ ఇస్తానన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను కౌన్సిల్ వ్యతిరేకిస్తున్నట్లు కృష్ణయ్య వివరించారు.