30వేల కోట్లు ఆస్తుల స్వాధీనం చేసుకుని 3వేల కోట్లు చెల్లించలేకపోతున్నారు ! ఈ చేతగానితనాన్ని ఏమనాలి - వామపక్షల నేతల ధ్వజం
🎬 Watch Now: Feature Video
Agrigold Victims Are Concerned : అగ్రిగోల్డ్ కంపెనీకి 30 వేల కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం మూడు వేల కోట్లను చెల్లించడానికి మీనా వేషాలు లెక్కిస్తుందని పశ్చిమ గోదావరి సీపీఐ కార్యదర్శి కోనాల భీమారావు విమర్శించారు. తణుకు నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన డిపాజిట్లు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు తెలిపాయి.
Help for Agrigold Victims : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పారని కోనాల భీమారావు విమర్శించారు. 20 వేల రూపాయలలోపు డిపాజిట్ దారులకు మాత్రమే చెల్లించారని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రతాప్ వ్యాఖ్యానించారు. మిగిలిన 10 లక్షల మందికి పెద్ద మొత్తంలో ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుకున్నారు. లేేకుంటే రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.