ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య - టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన - protest Against SV Arts College Student Suicide
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 10:10 PM IST
Agitation Against SV Arts College Student Suicide: తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర వివాదస్పదమవుతోంది. కళాశాలలో విద్యార్థిపై టీటీడీ నిఘా, భద్రతా అధికారులు దాడి చేసినట్లుగా భావిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధి మృతి ఘటనపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన చేపట్టారు.
పరిపాలనా భవనంలోకి వెళ్లేందుకు విద్యార్థులు, విద్యార్ధి సంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు విద్యార్థులు గేట్లు ఎక్కడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను నియంత్రించి పక్కకు పంపించేశారు. విద్యార్థి మరణానికి కారణమైన విజిలెన్స్ అధికారులు, ప్రిన్సిపల్‌ను తక్షణమే అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.