Adinarayana Reddy Respond on TDP, Janasena and BJP alliances: బీజేపీ కూడా టీడీపీ, జనసేన బాటలోనే: ఆదినారాయణరెడ్డి - AP Politics
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 4:07 PM IST
Adinarayana Reddy Respond on TDP, Janasena and BJP Alliances: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తుందనే ఆశాభావాన్ని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టు చాలా అక్రమంగా జరిగిందని అన్నారు. జగన్ కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి పనులు చేస్తున్నారు.. ప్రశ్నించే గొంతును నొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఎవరు ఎదురు తిరిగినా వారికై అక్రమంగా కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం పని అని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనతో కలిసి బీజేపీ కూడా ముందుకెళ్లడానికి త్వరలోనే అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. అయితే జగన్కు మాత్రం బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లేదని చెబుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డితో ముఖాముఖి.