యూటీఎఫ్ 36 గంటల ధర్నాకు అనుమతి నిరాకరించిన ఏసీపీ - 36 గంటలధర్నాకు నిరాకరణ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-01-2024/640-480-20463764-thumbnail-16x9-acp-refused-permission-for-36-hour-utf-protest.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 10:43 AM IST
ACP Refused Permission For 36 Hour UTF Protest: ఉపాధ్యాయ సంఘాలు చేపట్టే నిరసనలకు ఎటువంటి అనుమతి లేదని నార్త్ ఏసీపీ సీహెచ్ రవికాంత్ తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రవికాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘాలు 36 గంటలు ధర్నా చేయటానికి అనుమతి కోరారని తెలిపారు. ఇప్పటికే వివిధ చోట్ల సమ్మెలు జరుగుతుండడంతో అనుమతిని నిరాకరించామని, సెక్షన్ 30, 144లు అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ధర్నా జరిపితే కఠిన చర్యలు తప్పవని రవికాంత్ హెచ్చరించారు.
ఎన్నికల ముందు వైసీపీ సర్కార్ ఒకటో తేదీన జీతం, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డీఏలు ఇస్తామని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చిన తరువాత డీఏలు ఇవ్వకపోగా ఒకటో తేదీన జీతం ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగులకు ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జనవరి 9, 10వ తేదీల్లో విజయవాడలో 36 గంటల రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తామని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ గతంలో తెలిపారు.