Achchennaidu on Skill Development Scam: 'చంద్రబాబును 30ఏళ్లుగా చూస్తున్నా.. తప్పు చేయరు.. ఎవరినీ చేయనివ్వరు' - tdp state president Achchennaidu comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 6:57 PM IST
Achchennaidu on Skill Development Scam: టీడీపీ అధినేత చంద్రబాబును తాను 30 ఏళ్లుగా దగ్గరగా చూస్తున్నానని, ఆయన తప్పు చేయరు, ఎవరినీ చేయనివ్వరని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యకుడు అచ్చెన్నాయుడు అన్నారు. అలాంటి వ్యక్తిని (చంద్రబాబు)ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమంగా సంపాదించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నాశనమైందన్న ఆయన.. చంద్రబాబును జైలులో చూసి చాలా బాధ కలిగిందని వాపోయారు. స్కిల్ కేసు ఎప్పుడు పెట్టారు..?, ఎప్పుడు అరెస్టులు చేస్తున్నారు..? అని ప్రశ్నించారు.
Achchennaidu Comments: చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరశన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఆటో, భవన నిర్మాణ కార్మికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్కిల్ కేసులో అవినీతి రుజువైతే తామే నడిరోడ్డుపై ఉరితీసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్టు చేసి.. సీఎం జగన్ తన పీకను తానే కోసుకున్నాడని ఆక్షేపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తెలుగుదేశం-జనసేనలు 161స్థానాలతో అధికారం చేపడతాయన్నారు. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసమే తెలుగుదేశం-జనసేన కలిశాయని అచ్చెన్న స్పష్టం చేశారు. వైసీపీ బంగాళాఖాతంలో కలపకుంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారమేనని పేర్కొన్నారు.