టేకు చెట్ల నరికివేతకు 65వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎఫ్‌వో - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 1:33 PM IST
ACB Rides in DFO Office in Anakapally District : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అటవీ శాఖ అధికారులు చెట్ల నరికివేతకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. పెద్ద బొడ్డేపల్లికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తి నుంచి టేకు చెట్ల పర్మిట్ల కోసం 50 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపారు. ఈ మేరకు డీఎఫ్‌వో రాజారావుతో పాటు మరికొందరు సిబ్బందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. అలాగే డీఎఫ్ఓ (Forest Department Officials) ఆస్తులపైన సోదాలు నిర్వహిస్తామన్నారు.
DFO Caught ACB Taking Commission for Cutting Trees : కట్టింగ్ ఆర్డర్, ట్రాన్స్పోర్ట్కు కలిపి రూ. 65.500 డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపారు. వారు అడ్వాన్స్‌గా 50 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నామని చెప్పారు. విశాఖపట్నం డీజీపీ రాంజేంద్రనాథ్ ఆదేశాల మేరకు వారు డీఎఫ్ఓ ఆఫీస్‌లో సోదాలు జరిపామని తెలిపారు. కస్టడీలోకి తీసుకున్న డీఎఫ్ రాజారావుతో పాటు మరికొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్న వారిని రిమాండ్‌లో చూపిస్తామన్నారు.