ఏసీబీ వలలో పోస్టల్​ ఉద్యోగి - ₹2.50 లక్షలతో రెడ్​హ్యాండెడ్​గా అనిశాకు చిక్కిన కమిషనర్​ - ap latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 12:51 PM IST

Updated : Dec 20, 2023, 12:59 PM IST

ACB Raids In West Godavari Distrct : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. బ్యాంకు కాలనీలో నివాసముంటున్న తపాలా శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సోదాలు (Raids) నిర్వహించారు. సస్పెండైన తపాలా ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రూ.2 లక్షల యాభై వేలు లంచం తీసుకుంటుండగా అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుబ్రహ్మణ్యం  వద్ద ఉన్న పలు పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.

Anti Corruption Bureau Raids in Andhra Pradesh : సోదాలు జరిగిన తీరును చూస్తే పక్కా సమాచారంతోనే అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) అధికారులు తనిఖీలు నిర్వహించినట్టుందని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ సోదాలలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Last Updated : Dec 20, 2023, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.