Lingamaneni House Attachment: లింగమనేని రమేష్ ఇంటి జప్తుపై విచారణ.. తీర్పు రిజర్వ్ - Lingamaneni Ramesh
🎬 Watch Now: Feature Video
Lingamaneni House Attachment: వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఇంటి జప్తు అభ్యర్థన విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం సీఐడీ అధికారిని విచారించింది. జప్తు అభ్యర్థనకు ప్రాథమిక ఆధారాలేంటీ? ఇంటి నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటూ సీఐడీ అదనపు ఎస్పీ జయరాజ్‌ను ప్రశ్నించింది. జప్తునకు అనుమతించాలా.. లేదా అనేదానిపై ఈనెల 28న నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది. న్యాయాధికారి హిమబిందు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు లింగమనేని తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమకు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలంటూ వేసిన అనుబంధ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంపై హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లామని చెప్పారు. త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ విచారణ వాయిదా వేయాలని కోరగా న్యాయాధికారి హైకోర్టు నుంచి తమకు ఉత్తర్వులేవీ రాలేదని చెప్పి విచారణను కొనసాగించారు.
మరోవైపు లింగమనేని ఇంటి విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ కోర్టుకు చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఇది క్విడ్ ప్రో కో గా ఉందని ఆఫిడవిట్లో పేర్కొన్నట్లు న్యాయవాది తెలిపారు.
ఇంతకు ముందు పాస్ చేసిన ఆర్డర్ కి అనుగుణంగా ప్రత్యేక కోర్టు సీఐడీ అధికారిని పిలిచి వివరాలు అడిగారు. సీఐడీ అధికారి కూడా తను సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టుకు సమర్పించటం జరిగింది. న్యాయస్థానం ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఈ నెల 28న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.-వివేకానంద, ప్రభుత్వ న్యాయవాది