ఇంట్లో తాచుపాము హల్చల్ - చాకచాక్యంగా బంధించిన స్నేక్ క్యాచర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 3:03 PM IST
|Updated : Dec 5, 2023, 3:17 PM IST
A Snake in a House in Ambedkar District : డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జిల్లాలోని ఓ ఇంట్లో తాచుపాము హల్ చల్ చేసింది. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని సింగంశెట్టి వెంకట నాగభూషణం ఇంటిలోని వంటగదిలో ఓ మూలన దాక్కుంది. దానిని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఆ ఇంటి యాజమాని నాగభూషణం స్థానికులకు తెలియజేస్తే, అతనికి స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ వివరాలు ఇచ్చారు. తాచుపాము గురించి విషయం తెలిసిన వెంటనే గణేశ్ వర్మ హుటాహుటినా బయలుదేరాడు.
ఇంట్లో ఉన్న తాచుపామును చాలా సేపు శ్రమించిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో చాకచాక్యంగా దానిని బంధించాడు. గణేశ్ వర్మ పాము బంధించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గణేశ్ వర్మ చాకచాక్యంగా పామును పట్టుకోవడాన్ని చూసిన గ్రామస్థులు అతన్ని అభినందించారు. బంధించిన పామును నిర్జీవ ప్రదేశంలో విడిచి పెడతానని గణేశ్ వర్మ తెలియజేశాడు. గ్రామంలో ఎవరి ఇంట్లోకైనా పాము వస్తే తనకు సమాచారం ఇస్తే పామును బంధిస్తానని తెలిపారు.