ఘనంగా పుట్టినరోజు వేడుకలు మనిషికైతే కాదు.. ఎవరికంటే! - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
పుట్టినరోజు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు చేసుకునే వేడుక. ప్రస్తుత కాలంలో ఇలాంటి వేడుకలను తాము పెంచుకుంటున్న జంతువులకు కూడా చేస్తున్నారు. అయితే అది ఎక్కువ శాతం కుక్కలకు నిర్వహించడం చూసి ఉంటాం. కానీ ఓ వ్యక్తి నిర్వహించిన పుట్టినరోజు వేడుకలను చూసి ఆ గ్రామంలోని ప్రజలు అవాక్కయ్యారు. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా.. అతను తాను పెంచుకుంటున్న మేకపోతుకు జన్మదిన వేడుకలు నిర్వహించాడు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో చాకలి వెంకటేష్ అనే వ్యక్తి ఓ మేకపోతును పెంచుకుంటున్నాడు. అయితే అలా పెంచుకుంటున్న పోతుకు సంవత్సరం దాటిందని.. బాగా బలిష్టంగా పెరిగిందని సంతోష పడి పుట్టినరోజు వేడుకలు జరపాలని నిర్ణయించాడు. ఈ వేడుకలకు ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. కేక్ తెప్పించి మేకపోతుకు బెలూన్లు కట్టి అందంగా అలంకరించారు. అనంతరం కేక్ కట్ చేసి వచ్చిన పిల్లలకు, అతిథులకు పంచి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీని గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. మరికొద్దిమంది మేకపోతుపై అతనికున్న ప్రేమను పొగుడుతున్నారు.