ప్రజల ఆకాంక్షలు, అవసరాలను ప్రతిబింబించే సామాజిక, రాజకీయ పత్రమే రాజ్యాంగం : గవర్నర్ - ఏపీ రాజ్‌భవన్‌లో రాజ్యంగ దినోత్సవం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 3:35 PM IST
74th Constitution Day Celebrations at Raj Bhavan: రాజ్యాంగం కేవలం చట్టబద్ధమైనది మాత్రమే కాదని.. మారుతున్న ప్రజల ఆకాంక్షలు, అవసరాలను ప్రతిబింబించే సామాజిక, రాజకీయ పత్రమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా సజీవ పత్రంగా నిలుస్తోందని వివరించారు. విజయవాడ రాజ్‌భవన్‌లో నిర్వహించిన 74వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. రాజ్యాంగం మన దేశానికి మూలస్తంభం వంటిదని వివరించారు. మన దేశ పాలనకు ఇది పునాది వేసిందని.. ఎంతో ముందుచూపుతో రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. రాజ్యాంగం ఒక దృఢమైన ఫ్రేమ్‌వర్క్‌గా కాకుండా.. అనువర్తన పత్రంగా ఉండాలని పెద్దలు కోరుకున్నారన్నారు. పౌరులలో రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్ల వివరించారు.